రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు : నిమ్మల 1 y ago
AP : హంద్రీనీవాపై అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నాయకులను ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలను కూడా పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్, చంద్రబాబునే పూర్తి చేశారని తెలిపారు. చెక్ డ్యామ్‌లు, పంటకుంటల ద్వారా భూగర్భ జలాలు పెంచామన్నారు.